ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ - cbi court on cm jagan illigal assets case

అక్రమాస్తుల కేసులో.. జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరింత సమయం కోరింది. పెన్నా ఛార్జ్‌షీట్ నుంచి పేరు తొలగించాలన్న జగన్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ చేసింది.

CM JAGAN CASES
CM JAGAN CASES

By

Published : Aug 6, 2021, 7:30 PM IST

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పెన్నా కేసు నుంచి తొలగించాలన్న జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఇండియా సిమెంట్స్ కేసులోనూ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తామని జగన్​ తెలిపారు.

పెన్నా కేసులో సబిత డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. పెన్నా, రఘురాం, ఇండియా సిమెంట్స్ ఛార్జ్‌షీట్ల విచారణ ఈనెల 13కు వాయిదా పడింది. ఈడీ కేసుల విచారణ అంశంపై హైకోర్టు తీర్పు రావాల్సి ఉందని సాయిరెడ్డి అన్నారు. విజయసాయిరెడ్డి అభ్యర్థనతో ఈడీ కేసుల విచారణ ఈనెల 20కి వాయిదా పడింది.

ఇదీ చదవండి:

10th Results: 'పది' ఫలితాలు విడుదల..సబ్జెక్టులు, ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు

ABOUT THE AUTHOR

...view details