ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

250 కిలోల గోల్డ్​ స్మగ్లింగ్​ కేసులో ఓ వ్యాపారి అరెస్టు

ఘన శ్యామ్ జ్యువెల్లర్స్ యజమాని కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్​ను ఎన్​ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఎగుమతి చేసే బంగారాన్ని నిబంధనలకు విరుద్ధంగా దేశీయంగా అమ్మి సొమ్ము చేసుకున్నట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది.

ed
250 కిలోల గోల్డ్​ స్మగ్లింగ్​ కేసులో ఓ వ్యాపారి అరెస్టు

By

Published : Mar 11, 2021, 10:47 PM IST

బంగారం స్మగ్లింగ్ కేసులో ఘన శ్యామ్ జ్యువెల్లర్స్ యజమాని కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్​ను ఎన్​ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఎగుమతి చేసే బంగారాన్ని నిబంధనలకు విరుద్ధంగా దేశీయంగా అమ్మి సొమ్ము చేసుకున్నట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది.

కోల్​కత్తాలో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేపట్టగా దాదాపు 250 కిలోల బంగారాన్ని పలు ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసి.. వాటిని ఎలాంటి పన్ను కట్టకుండా పలువురికి విక్రయించినట్లు గుర్తించారు. హవాలా మార్గంలో తరలించినట్లు తేలడంతో డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు ఎన్​ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు.

హైదరాబాద్​లోని ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సుంకం ఎగవేసి భారీ ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి :చేతబడి నెపంతో హత్యచేసి.. ఇసుకలో పూడ్చివేసి

ABOUT THE AUTHOR

...view details