ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వేలమూరి పాడు వద్ద వరి గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు గొనుగుంట్ల శ్రీనివాసరావుగా స్థానికులు గుర్తించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరిగడ్డి ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి - prakasam district accidents latest news
వరిగడ్డి ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వేలమూరిలో జరిగింది.
ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి