ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్​.. బయటపడ్డ అవయవాలు

By

Published : Apr 1, 2021, 7:35 PM IST

ట్రాక్టర్ ఢీ కొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో.. ఓ వ్యక్తి ప్రాణాలుకోల్పోయాడు.

road accident in guntur
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్​

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రకు చెందిన అక్షయ్ అనే వ్యక్తి మేడికొండూరు మండలం పేరేచర్లలో ఉంటూ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఓ వ్యక్తికి చెందిన మిరప పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మధ్యాహ్న భోజనం కోసమని దుకాణాలకు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్.. ఇతని ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.

ప్రమాదంలో బండి... కాలువ గట్టు కిందకు దూసుకు పోయి పల్టీలు కొట్టింది. అక్షయ్ అక్కడిక్కడే ప్రాణాలుకోల్పోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అవయవాలు బయటకు వచ్చాయి. సమాచారం అందుకున్న మేడికొండూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details