ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తెలంగాణలో.. మావోయిస్టు దంపతులు అరెస్ట్ - telangana crime news today

తెలంగాణలో ఇద్దరు మావోయిస్టు దంపతులను రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు ఫోన్లు, ఇతర పుస్తకాలు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సింగరేణి ప్రాంతంలో తిరిగి మావో కార్యకలాపాలు చేపట్టేందుకు వారు వ్యూహం రచించినట్లు సీపీ సత్యనారాయణ వెల్లడించారు.

top maoist couple arrested by telangana police
top maoist couple arrested by telangana police

By

Published : Mar 22, 2021, 7:05 PM IST

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు దంపతులు అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు రామగుండం సీపీ సత్యనారాయణ వివరాలను తెలిపారు. సింగరేణి ప్రాంతంలో తిరిగి మావో కార్యకలాపాలు చేపట్టేందుకు సికాస పునర్ నిర్మాణానికి వ్యూహం రచించిన.. మావోయిస్ట్ సభ్యులు వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ అభయ్, అతని భార్య విజయలక్ష్మిలను అరెస్ట్ చేశారు.

సింగరేణి కార్మిక సంఘం(సికాస) పునర్ నిర్మాణానికి క్యాతన్​పల్లిలోని తెలంగాణ విద్యావంతుల వేదిక మాజీ అధ్యక్షుడు, సికాస మాజీ జనరల్ సెక్రటరీ గురిజాల రవీందర్ రావు.. తన ఇంట్లో 20 రోజులు అభయ్, విజయలక్ష్మిలకు ఆశ్రయం ఇచ్చినట్లు సీపీ చెప్పారు.

పక్కా సమాచారంతో ఆదివారం గురిజాల ఇంట్లో సోదాలు నిర్వహించి.. విజయవాడ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి మూడు ఫోన్లు, ఓ ల్యాప్ టాప్, రెండు మెమొరీ కార్డులు, పుస్తకాలు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరుస్తామని సీపీ సత్యనారాయణ వివరించారు.

ఇదీ చూడండి:

రిజిస్ట్రేషన్ ఉండదు.. ఏ రీచ్​ నుంచైనా ఇసుక తీసుకెళ్లవచ్చు: జి.కె. ద్వివేది

ABOUT THE AUTHOR

...view details