చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి టమాటా లోడుతో కలకత్తా వెళ్తున్న లారీ గుంటూరు జిల్లా కొండ్రుపాడు వద్ద బోల్తా పడింది. మరో లారీని క్రాస్ చేయబోతుండగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ సిద్దయ్య, క్లీనర్ చాంద్ భాషాలకు గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానిక ప్రజలు క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లారీ రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
LORRY BOLTHA: టమాటా లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. - ap latest news
గుంటూరు జిల్లా చిలకలూరిపేట- నరసరావుపేట మార్గంలోని కొండ్రుపాడు వద్ద టమాటా లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సిద్దయ్య, క్లీనర్ చాంద్ భాషాలకు గాయాలయ్యాయి.
![LORRY BOLTHA: టమాటా లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. TOMATO LORRY BOLTHA AT GUNTUR DISTRICT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13184001-211-13184001-1632713979109.jpg)
టమాటా లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు..