తిరుపతి జిల్లా:దాసరిమఠానికి చెందిన చంద్రన్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ కుమారుడిని చెంచయ్య అనే వ్యక్తి చంపాడని మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుత్తూరులో చెంచయ్యను అదుపులోకి తీసుకుని తిరిగి వస్తుండగా.. వడమాలపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తిరుపతి తూర్పు పీఎస్ ఎస్‌ఐ గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు.
* చంద్రగిరి మండలంలోని భాకరాపేట కనుమ దారిలో ఈరోజు ఉదయం లారీ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. జరిగింది. లారీకి బ్రేక్ ఫెయిల్ అవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు లారీ డ్రైవర్ రఫీ తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
* చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కూల్‌డ్రింక్స్ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అంబులెన్స్ సాయంతో డ్రైవర్ని ఆసుపత్రికి తరలించారు.
నెల్లూరు జిల్లా: కందుకూరులోని విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉన్న సామగ్రి చోరీకీ గురైంది. కార్యాలయ తాళాలు పగలగొట్టి దొంగిలించిన సామాన్లను వాహనంలో తరలించారు. సామాగ్రి చోరీ ఘటనపై కార్యాలయం వద్ద యూటీఎఫ్ నాయకుల ఆందోళన చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా: పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. లారీని మార్నింగ్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రలను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ప్రాజెక్ట్ వర్క్ ముగించుకొని మచిలీపట్నంకు స్కూటీలపై విద్యార్థులు తిరిగి వస్తుండగా కంకిపాడు మండలం దావులూరు టోల్ గేట్ సమీపంలో ప్రమాదం జరిగింది. అడ్డదారి నుండి ధాన్యం బస్తాలతో నుండి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సుజ శ్రీ (20) మృతి చెందింది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
అనంతపురం జిల్లా: మద్యం మత్తులో కారు బీభత్సం సృష్టించిన ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో చోటుచేసుకుంది. కర్నూల్ నుంచి గుంతకల్లు వెళ్తున్న కారు గుత్తి పట్టణంలోని శాంతి ప్రియ హాస్పిటల్ సమీపంలోకి రాగానే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఎదురుగా ఉన్న 11 కె.వి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.