Crime News in AP : కర్నూలు శివారులోని కార్బైడ్ కర్మాగారం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సినిమాల్లో జరిగే రోడ్డు ప్రమాదాల్ని తలపించింది. డోన్ నుంచి కర్నూలు వైపు వస్తున్న కారు కార్బైడ్ కూడలి వద్ద మలుపు తిరుగుతున్న బైకును ఢీకొట్టింది. ఆ బైకు ముందు వెళ్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కారు మళ్లీ మరో బైకును ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో మిడుతూరు మండలం సెట్కూరుకు చెందిన బలరాము (40) మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు కర్నూలు మండలం అంబేడ్కర్ నగర్ కు చెందిన సుకుమార్, జయ, సంజుతోపాటు వర్కూరుకు చెందిన రామచంద్రుడు, ధనుంజయలుగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి...పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
TODAY CRIME NEWS: కర్నూలు శివారులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - ఏపీలో నేర వార్తలు
AP Crime News: కర్నూలు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏపీలో నేర వార్తలు