పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం మడకంవారిగూడెంలో గిరిజన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్షలలో ఉత్తీర్ణుడు కాలేదని మనస్థాపానికి గురైన అనిల్ కలుపు మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధం కాగా అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్థారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీలుగుమిల్లి ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.. 6లక్షల నగదు స్వాధీనం:ఏలూరులో ద్విచక్రవాహనంలో దాచిన డబ్బు దొంగిలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.6 లక్షల నగదు, బైక్, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
గోరంట్లలో భారీ మద్యం పట్టివేత: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో భారీ మద్యంను సెబ్ అధికారులు పట్టుకున్నారు. సెబ్ పోలీసులకు వచ్చిన సమాచారంతో గ్రామంలో తనిఖీ చేయగా 22 బాక్స్‌ల మద్యం, 2112 టెట్రా ప్యాకెట్స్ లభ్యమయ్యాయి. కర్ణాటక రేట్ల ప్రకారం మద్యం విలువ Rs.75 వేలు ఉంటుందని సీఐ తెలిపారు. వారి మీద మీద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని సెబ్ సీఐ తెలిపారు.
బైపాస్ నిర్మాణ పనుల వద్ద రోడ్డు ప్రమాదం .. యువకుడు మృతి: గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణ పరిధిలో బైపాస్ నిర్మాణ పనుల జరుగుతున్న ప్రదేశంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. అర్బన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.