BLACK MAGIC CHEATING CASE IN CHOTTOOR: ఓ చెంబుకు అతీతశక్తులు ఉన్నాయని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న నలుగురిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన బండారి హేమంత్ కుమార్(28) యూట్యూబ్‌లో చూసి.. ఓ చెంబుకు కొన్ని రసాయనాలు అద్ది బియ్యాన్ని ఆకర్షించేలా తయారుచేశాడు. దానికి అతీత శక్తులు ఉన్నాయని గుంటూరు జిల్లా పెద్దకాకానికి చెందిన షేక్ యాసీన్‌ను నమ్మించాడు. దీంతో యాసీన్ దాన్ని కొనేందుకు స్నేహితుడితో తిరుపతికి వచ్చారు. హేమంత్ కుమార్ తన స్నేహితులైన మనోజ్‌కుమార్ (34), ఆర్కాట్ విజయ్ కుమార్ (44), బిర్ల నాగరాజు(34)తో కలిసి ఆ నల్లరంగు చెంబును చూపించారు. చెంబు కొనేందుకు షేక్ యాసీన్ వారికి రూ.1.54 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చారు.
FOUR PEOPLE ARREST IN TIRUPATHI BLACK MAGIC CASE : నల్ల చెంబుకు అతీతశక్తులు... చివరకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు! - ఏపీ లేటెస్ట్ న్యూస్
FOUR PEOPLE ARRESTED IN TIRUPATHI: నా దగ్గర ఉన్న ఓ చెంబుకు అతీతశక్తులున్నాయి. కావాలంటే చూడు. ఈ చెంబు బియ్యాన్ని ఎలా ఆకర్షిస్తుందో అంటూ మాయ చేశాడు. డబ్బులు ఇస్తే.. ఈ చెంబు నీ సొంతమన్నాడు. డబ్బులు పోతే పోయాయి.. అతీత శక్తులున్న చెంబు వస్తుందనుకొని.. అడ్వాన్సుగా లక్షన్నర రూపాయలు కట్టాడు. తీరా ఇంటికెళ్లి చూశాక అవాక్కయ్యాడు.
ఆ తర్వాత దానికి ఎలాంటి శక్తులు లేవని తెలుసుకుని.. అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి.. సీఐ దేవేంద్రకుమార్, ఎస్‌ఐ జయచంద్ర ఆధ్వర్యంలోని బృందం శనివారం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది. నిందితులు రైసు పుల్లింగ్ పేరుతో మోసం చేస్తూ నగదు కాజేసినట్లు విచారణలో అంగీకరించారని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.1.54 లక్షల నగదు, చెంబు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి తూర్పు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.
ఇదీ చూడండి:Boy Missing In Peddapuram: 12 ఏళ్ల బాలుడు అదృశ్యం..!