విషాదం: కృష్ణా నదిలో మునిగి.. ముగ్గురు యువకులు మృతి - Vijayawada news
20:17 June 27
విజయవాడలో విషాదం
కృష్ణా నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. విజయవాడ పెద్దపులిపాక వద్ద ఉన్న కృష్ణా నదిలో కర్రిమొలకల గోవిందు, సాయి శ్రీనివాస్, సతీష్, శివ అనే యువకులు స్నానానికి వెళ్లారు. అందులో ముగ్గురు మునిగిపోయి మృతి చెందారు. శివ ఒడ్డునే ఉండడంతో అతనికి ఏమీ కాలేదు.
విషయం తెలుసుకుని..సంఘటనా స్థలానికి చేరుకున్న పెనమలూరు పోలీసులు, ఆటోనగర్ అగ్నిమాపక సిబ్బందితో కలసి మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:Flash: బీచ్లో నలుగురి గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం!