Tractor Accident: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. దూసముద్రం చెరువు కట్టపై ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మండలంలోని పర్షా తండాకు చెందిన మొత్తం 9 మంది...పెళ్లి సామగ్రి కొనుగోలు చేయడానికి ట్రాక్టర్లో నర్సంపేటకు బయలుదేరారు. చెరువు కట్ట చిన్నదిగా ఉండడం... ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా... ఐదుగురు మృతి - three were died in accident
Tractor Accident: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. దూసముద్రం చెరువు కట్టపై ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయలయ్యాయి.
![చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా... ఐదుగురు మృతి ట్రాక్టర్ బోల్తా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15317830-901-15317830-1652863039640.jpg)
ట్రాక్టర్ బోల్తా