Three Students Died: హైదరాబాద్లోని జవహర్నగర్ పోలీస్స్టేషన్లో పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మల్కారం ఈదుళ్ల చెరువులో ఈత కోసం వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మొత్తం ఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లగా.. అందులో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులకు ఈత రాకపోవడం వల్ల నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు.
గబ్బిలాల్పేట్లో నివాసం ఉంటున్న.. యువ చందు, విజయ్, నవీన్.. శిశు జ్ఞాన మందిర్ పాఠశాలలో 6, 7 తరగతి చదువుకుంటున్నారు. పాఠశాల ముగిసిన అనంతరం సరదాగా ఈతకు వెళ్దామని ఆరుగురు విద్యార్థులు బయలుదేరారు. ఈతకు వెళ్లిన ఆరుగురిలో.. ముగ్గురు విద్యార్థులకు ఈత రాకపోవడంతో ప్రమాదం సంభవించింది.