Road accidents: ఎన్టీఆర్ జిల్లా నందిగామ అంబర్ పేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు స్వామి మాల ధరించి ఉన్నారు . వీరి వద్ద ఉన్న నాలుగు లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు ముసునూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, కొల్లిస్వామి లక్ష్మణ కుమార్ గా గుర్తించారు. మృతదేహాలను నందిగామ మార్చురీకి తరలించారు.
Road accidents: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి - ముగ్గురు మృతి చెందారు
Road accidents రాష్ట్రంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని మరొకరు మృతి చెందారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
ప్రైవేట్ ట్రావెల్ బస్ ఢీ కొని వ్యక్తి మృతి.. గుంటూరు జిల్లా మేడి కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ..వాహనదారుడు మృతి చెందాడు. మృతుడు మేడి కొండూరుకు చెందిన బోరుగడ్డ మోహన్గా పోలీసులు తెలిపారు. గుంటూరులోని ఓ పత్రికా కార్యాలయంలో రాత్రి విధులు ముగుంచుకొని వస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న మోహన్ బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవీ చదవండి: