Three persons killed train rams: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్దనున్న రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు పురుషులు, ఒక మహిళ వస్తుండగా గూడూరు వైపు నుంచి విజయవాడకు వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ వీరిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు రైలు పట్టాలపైనే మృతి చెందగా.. మహిళ పట్టాల పై నుంచి కిందపడి మరణించింది. ముగ్గురూ 45- 50 ఏళ్లలోపు వారే. వారి చేతుల్లో సంచులు ఉన్నాయి. కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం పురుషులు రైలు పట్టాల పక్కన ఉండగా.. మహిళ పట్టాలపై ఉన్నారని.. ఆమెను తప్పించబోయి.. వారు కూడా మృత్యువాత పడ్డారని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ దుర్ఘటనలో మృతులను జిల్లా ఆసుపత్రికి తరలించిన రైల్వే పోలీసులు.. ఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలతో.. మృతుల వివరాలను సేకరించారు.
నెల్లూరులో రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం.. మృతుల వివరాలు లభ్యం
Train Accident: నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందిన ఘటనకు సంబంధించి పోలీసులు మృతుల వివరాలను వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ దొరికిన ఆధారాలను బట్టి మృతుల చిరునామాలను సేకరించామన్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముత్యాలపాళెంకు చెందిన విశ్రాంత లెక్చరర్ పోలయ్య.. తన భార్య సుగుణమ్మతో కలిసి తిరుమలకు వెళ్లి, రైలులో నెల్లూరూకు చేరుకున్నారు. మరో వ్యక్తి విజయవాడకు చెందిన సరస్వతి రావు.. పెద్దాసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న తన భార్యను కలిసేందుకు నెల్లూరుకి వచ్చారు. రైలు దిగిన ఈ ముగ్గురు ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి పట్టాలపై నడుచుకుంటూ వస్తుండగా ఆత్మకూరు బస్టాండు అండర్ బ్రిడ్జిపై గూడూరు నుంచి విజయవాడ వైపు వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ వీరిని ఢీకొట్టింది. దీంతో మహిళ రైలు పట్టాల పై నుంచి అండర్ బ్రిడ్జి కింద పడి మరణించగా, పురుషులిద్దరు పట్టాలపైనే మరణించారు.
ఇవీ చదవండి: