Hyderabad tourists drowned: కర్ణాటకలోని ఓ జలపాతానికి విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు తెలంగాణ వాసులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించారు. తెలంగాణకు చెందిన 16 మంది బంధుమిత్రులు కలిసి విహారయాత్ర నిమిత్తం కర్ణాటకు వెళ్లారు. కుశాలానగర్‌లోని ప్రైవేట్ హోమ్‌స్టేలో బస చేసిన పర్యాటకులు.. ఈరోజు కొడగు జిల్లా మడికేరి తాలూకాలోని ముకోడ్లు సమీపంలోని కోటే అబ్బి జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. సరదాగా నీటిలో దిగిన ముగ్గురు పర్యాటకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఘటనా సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో.. వారిని రక్షించడం అసాధ్యంగా మారింది.
విషాదం నింపిన విహారం.. కర్ణాటకలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి - Hyderabad tourists drowned
Hyderabad tourists drowned: బంధుమిత్రులంతా కలిసి వెళ్లిన విహారయాత్ర.. ముగ్గురు ప్రాణాలను బలిగొంది. అప్పటివరకు ఎంతో వినోదంగా గడిపిన వారిని.. ఒక్కసారిగా విషాదం అలుముకుంది. సరదాగా జలపాతంలో దిగిన ముగ్గురు వ్యక్తులు.. తిరిగి విగతజీవులుగానే బయటికివచ్చారు. వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపారు. ఈ విషాదం.. కర్ణాటకలోని అబ్బి జలపాతంలో చోటుచేసుకుంది.
మృతి
మృతులు సూర్యాపేటకు చెందిన శ్యామ్ (36), షాహీంద్ర (16), శ్రీ హర్ష (18)గా గుర్తించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిశీలించి గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి గాలింపు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది.. ఎట్టకేలకు ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. అప్పటి వరకు సంతోషంగా తమ మధ్యే ఉన్న తమ ఆత్మీయులు.. విగతజీవులుగా మారటంతో బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవీ చూడండి: