Three Farmers Died: వైయస్సార్ జిల్లా చాపాడు మండలం చియ్యపాడులో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు రైతులు విద్యుదాఘాతంలో ప్రాణాలు కోల్పోయారు. వరి పొలంలో పురుగుమందు పిచికారి చేసేందుకు వెళ్లిన రైతులకు... ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.
వైఎస్సార్ జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు మృతి
14:17 October 28
పొలానికి పురుగుల మందు పిచికారి చేస్తుండగా విద్యుదాఘాతం
ఎలా జరిగిందంటే..? చియ్యపాడు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి ఓబుల్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి అన్నదమ్ములు... భూమిని కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేస్తున్నారు. మరో రైతు మల్లికార్జున్ రెడ్డిని కూలీకి పిలిపించుకొని ఇవాళ ఉదయం పొలంలో పురుగుమందు పిచికారి చేసేందుకు వెళ్లారు. పిచికారి చేస్తుండగా... ప్రమాదవశాత్తు ఒరికి విద్యుత్ తీగలు తగిలాయి. అతడిని రక్షించేందుకు వెళ్లి.. మరో ఇద్దరు రైతులకు కూడా విద్యుత్ షాక్ తగలడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. వరి పొలంలో విద్యుత్ తీగలు ఎత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన చాపాడు పోలీసులు... మృతదేహాలను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: