న్యాయవాద దంపతులను హత్య చేసిన ముగ్గురిని మంథని న్యాయస్థానం జుడీషియల్ రిమాండ్ విధించింది. వీరికి ఆయుధాలు, వాహనం సమకూర్చిన బిట్టు శ్రీను మాత్రం ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ముగ్గురు నిందితులను మంథని సీనియర్ సివిల్ జడ్జి ఎదుట కోర్టులో రాత్రి 11.03గంటలకు పోలీసులు హాజరుపరిచారు.
సీన్ రీకన్స్ట్రక్షన్ అనంతరం..
గట్టు వామనరావు, నాగమణిల హత్య కేసులో ఏ-1 కుంట శ్రీనివాస్, ఏ-2 చిరంజీవిలను మహారాష్ట్ర సరిహద్దులో, ఏ-3గా ఉన్న అక్కపాక కుమార్ను మంథనిలో పోలీసులు అరెస్టు చేశారు. కేసుపై 24 గంటల విచారించిన పోలీసులు... హత్య జరిగిన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అనంతరం ముగ్గురు నిందితులకు గోదావరిఖనిలో కరోనా, ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..