steal the bike: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని చిన మామిడిపల్లి నాగారమ్మ ఆలయం సమీపంలో.. బైకుల చోరీకి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చేసిన విఫలయత్నం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 10న రాత్రి ఒంటిగంట సమయంలో ఇద్దరు దుండగులు బైకుపై వచ్చి ఆలయం వద్ద ఉంచిన ద్విచక్రవాహనాలను దొంగిలించడానికి విశ్వప్రయత్నం చేశారు. వాటి తాళం రాకపోవడంతో చివరకు అక్కడి నుంచి జారుకున్నారు.
బైకుల చోరీకి దుండగుల విఫలయత్నం... సీసీ కెమెరాల్లో రికార్డ్ - నర్సాపురంపట్నం చోరీ విఫలం
steal the bike: బైకులను ఎత్తుకెళ్లడానికి ఇద్దరు దొంగలు చేసిన ప్రయత్నం విఫలమైంది. తాళం రాకపోవడంతో వెనుతిరిగిన దృశ్యాలు సమీపంలోని ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని ఆలయ కమిటీ విడుదల చేశారు.
బైకుల చోరీకి యత్నం
ఈ సంఘటనకు సంబంధించి దృశ్యాలు నాగారమ్మ ఆలయంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటిని ఆలయ కమిటీ సామాజిక మాధ్యమం వేదిక విడుదల చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. వాహనాలు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: దివ్యాంగుడిని ఉరేసి చంపేందుకు యత్నించి.. గొర్రెలు అపహరించిన దుండగులు