ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

రెచ్చిపోయిన దొంగలు.. గ్యాస్​ కట్టర్​ ద్వారా ఏటీఎంలో చోరీ - అల్లూరి జిల్లా తాజా వార్తలు

MONEY THEFT FROM ATM : రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. కష్టపడి డబ్బులు సంపాదించలేక అడ్డదారులు తొక్కుతున్నారు. ఒక్కసారే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆశతో దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా అల్లూరి జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు ఏటీఎంలో ఉన్న సొమ్మును ఎత్తుకుపోయారు.

MONEY THEFT FROM ATM
MONEY THEFT FROM ATM

By

Published : Feb 11, 2023, 2:06 PM IST

MONEY THEFT FROM ATM : సమాజంలో చాలా మంది లగ్జరీగా బతకాలనుకుంటారు. అందుకోసం కొద్దిమంది రాత్రింబవళ్లు కష్టపడితే.. మరి కొంతమంది అడ్డదారులు ఎంచుకుంటారు. అందులో ఒకటి దొంగతనం. అయితే చాలా మంది చిన్న చితకా దొంగతనాలు చేస్తే.. మరికొంత మంది అందుకు భిన్నంగా ఆలోచిస్తారు. కొడితే కుంభస్థలాన్ని బద్ధలు కొట్టాలి అన్నట్లు పెద్ద వాటికే ఎసరుపెడుతుంటారు. ఇక్కడ కూడా దొంగలు అలానో ఆలోచించి ఏటీఎం ను ఎంచుకున్నారు.

ఇది వరకూ ఏటీఎంలో దొంగతనం అంటే.. షాపులు పగలకొట్టి అందులో ఉన్న డబ్బులు ఎత్తుకెళ్లేవారు. అయితే మేము కూడా అప్​డేట్​ అయ్యాము అన్నట్లుగా గ్యాస్​ కట్టర్లతో ఏటీఎంలను సులువుగా కత్తిరించి నగదును లూటీ చేస్తున్నారు. తాజాగా అల్లూరి జిల్లాలో కూడా దొంగలు ఇదే విధానాన్ని ఫాలో అయ్యి.. 30 లక్షల సొత్తును దోచుకెళ్లారు.

ఒడిశా పరిధిలోని కోరాపుట్ జిల్లా పాడువ పోలీస్​స్టేషన్ పరిధిలో ఉన్న స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ) ఏటీఎంను.. గ్యాస్ కట్టర్‌తో కోసి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఏటీఎంలో దాదాపు 30 లక్షల రూపాయలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

అయితే దొంగతనం గురించి తెలియగానే నందాపుర్ SDPO సంజయకుమార్ మహాపాత్రో నేతృత్వంలో పోలీసులు.. పాడువ ఏటీఎంను పరిశీలించారు. చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని పెదబయలు, ముంచంగిపుట్టు పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే చోరీకి పాల్పడింది ఒడిశాకు చెందిన వారా లేక ఆంధ్రప్రదేశ్​కు చెందిన వారా అన్న దిశలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్​ టీం వచ్చిన తర్వాత చోరీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details