తెలంగాణలోని నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం వద్ద దారి దోపిడీ జరిగింది. రైతు నర్సయ్య వద్ద నుంచి రూ.6.04 లక్షలను దుండగులు లాక్కెళ్లారు. నకిరేకల్‌లోని బ్యాంకులో ఈ మధ్యాహ్నం.. రైతు నర్సయ్య రూ.6 లక్షలు లోన్ తీసుకున్నారు. అనంతరం నగదు తీసుకొని తీసుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. పెర్కకొండారం శివారులో రైతు నర్సయ్యను అడ్డుకున్న ఇద్దరు దొంగలు.. నగదు లాక్కెళ్లారు.
రైతు నుంచి రూ.6.04 లక్షలు లాక్కెళ్లిన దొంగలు - నల్గొండ జిల్లాలో నేరవార్తలు
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో రైతు వద్ద నుంచి దొంగలు రూ.6.04 లక్షలు లాక్కెళ్లారు. బ్యాంక్‌లో లోన్ తీసుకున్న రైతు.. ఆ డబ్బుతో ద్వి చక్ర వాహనంపై వెళ్తుండగా ఈ దోపిడీ జరిగింది.

రైతు వద్ద నుంచి రూ.6.04 లక్షలు లాక్కెళ్లిన దొంగలు