THEFT: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలోని సాయిబాబా గుడిలో తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని ముగ్గురు యువకులు ఆలయంలో ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లారు. హుండీలోని డబ్బు తీసుకుని.. దానిని సమీపంలోని పొలాల్లో వదిలేసి వెళ్లిపోయారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో ఎవరైనా కొత్త వాళ్లు వచ్చారా.. లేక వలస కూలీల పనా అనే కోణంలో విచారణ చేపడుతున్నామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.
సాయిబాబా గుడిలో చోరీ.. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు - ఏపీ తాజా వార్తలు
THEFT: రాష్ట్రంలో రోజురోజుకీ నేరాల సంఖ్య పెరుగుతోంది. సీసీకెమెరాలు ఉన్నా చోరులు వాటిని లెక్కచేయకుండా వారి పని కానిచ్చుకుంటున్నారు. దొరికితే దొంగల్లా.. దొరక్కపోతే దొరలుగా చెలామణి అవుతున్నారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు గుంటూరు జిల్లాలో సాయిబాబ దేవాలయంలోకి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లారు.
THEFT