వృద్ధురాలిని బెదిరించి... బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగ - గుంటూరు జిల్లాలో చోరీ వార్తలు
10:33 September 20
గుంటూరులో ఘటన
వృద్ధురాలిని బెదిరించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది. బాపట్ల పట్టణంలోని కర్లపాలెం రోడ్డులో ఉంటున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు లేళ్ల శాంతకుమారి ఇంట్లోకి నేటి తెల్లవారుజామున ఓ దొంగ దూరాడు. ఆమెపై దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు.
అరిస్తే చంపేస్తానని బెదిరించాడని... ఎవరైనా వచ్చి కాపాడతారేమోనని కేకలు వేసినట్లు శాంతకుమారి తెలిపారు. దాంతో దొంగ తనపై దాడిచేసి తన ఆభరణాలను లాక్కెళ్లాడని వాపోయారు. 8.50 సవర్లకు పైగా ఆభరణాలు చోరీ అయినట్లు ఆమె బాపట్ల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి