ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Theft in PS: లాయర్ కోటు వేశాడు.. పోలీస్ స్టేషన్​కు పోయాడు.. బైకులు ఎత్తుకెళ్లాడు!! - నెల్లూరు జిల్లా క్రైమ్ వార్తలు

Theft in kavali police station: ఎక్కడైనా దొంగతనం జరిగితే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ పోలీస్ స్టేషన్లోనే దొంగలు పడితే..? సరిగ్గా ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. మరి, ఈ వ్యవహారమేంటో మీరూ చూడండి!

Theft in PS
Theft in PS

By

Published : Jan 7, 2022, 2:42 PM IST

Theft in kavali police station: నెల్లూరు జిల్లా కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో రెండు బైకులు అపహరణకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. ఆశ్చర్యపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ దొంగతనం చేసింది.. లాయర్ కోటు వేసుకున్న దొంగ!

గతంలో పాత నేరస్థుడైన రమణి రాజేంద్ర కుమార్ (31) నెల్లూరులోని జవాహర్ రెడ్డి కాలనీలో నకిలీ లాయర్​గా అవతారమెత్తాడు. పలువురు సీనియర్ లాయర్ల దగ్గర పనిచేస్తూ.. పోలీస్ స్టేషన్​కు వస్తూ.. పోతూ ఉండేవాడు.

ఈ క్రమంలోనే.. ఠాణాలోని ద్విచక్రవాహనాలపై అతని కన్ను పడింది. ఎలా కాజేశాడో గానీ.. స్టేషన్​లోని పోలీసులకు తెలియకుండా.. సీజ్ చేసి స్టేషన్లో పెట్టిన TS 08 FW 3605 టీవీఎస్ జూపిటర్, AP 26 AT 7927 యమహా బైక్​లను దొంగలించాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టి రాజేంద్ర కుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రూ. 1.40 లక్షల విలువైన రెండు బైకులను స్వాధీనం చేసుకుని.. రిమాండ్​కు తరలించారు.


ఇదీ చదవండి:'డబ్బు అడిగితే ఇచ్చేవాడిని.. కానీ నా భార్యను అడిగాడు'

ABOUT THE AUTHOR

...view details