చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీవారి మెట్టుకు వెళ్ళే మార్గంలో ఉన్న శ్రీ కనక దుర్గమ్మ దేవాలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈరోజు ఉదయం గుడి తెరిచేందుకు వచ్చిన ఆలయ పూజారి విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. తాళిబొట్టు కాజేసిన దొంగలు! - చిత్తూరు తాజా నేర వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. హుండీలోని డబ్బుతో పాటు అమ్మవారి బంగారి తాళిబొట్టు, వెండి ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు ఆలయ అర్చకుడు చెప్పారు.

కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. అమ్మవారి బంగారి తాళిబొట్టు స్వాహా..
దేవాలయం హుండీలోని నగదు, అమ్మవారి మెడలోని బంగారు తాళిబొట్టుతోపాటు కొన్ని వెండి ఆభరణాలు సైతం చోరీకి గురైనట్లు ఆలయ అర్చుకుడు చెబుతున్నారు. ఆలయ ఆవరణలోకి ఎవరినీ రానివ్వకుండా కట్టుదిట్టం చేసి.. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి:AMARAVATI PADAYATRA: అమరావతి పాదయాత్రకు హెచ్చరికలు.. భారీగా మోహరించిన పోలీసులు