కృష్ణా జిల్లా నందిగామలో తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రైతుపేటలోని వాణిజ్య సముదాయం షట్టర్స్ పగలగొట్టి... శాంసంగ్ షోరూం దుకాణంలో ఉన్న 80 వేల రూపాయల నగదు, సెల్ఫోన్లు, గృహోపకరణాలు, ఇతర వస్తువులను పెద్ద ఎత్తున అపహరణ చేశారు. దీంతో షోరూం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నందిగామలో దొంగల బీభత్సం.. సెల్‌ఫోన్లతోపాటు నగదు అపహరణ.. - కృష్ణా జిల్లా నేర వార్తలు
కృష్ణా జిల్లా నందిగామలో దొంగలు కలకలం సృష్టించారు. రైతుపేటలోని శాంసంగ్ సెల్‌ఫోన్ల దుకాణం తాళాలు పగులగొట్టి 80 వేల రూపాయల నగదుతోపాటు సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. విషయం గుర్తించిన దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నందిగామలో దొంగల బీభత్సం.. సెల్‌ఫోన్లతోపాటు నగదు అపహరణ..
ఇటీవలే కంచికచర్ల మండలం చెవిటికల్లులోని ఓ ఇంట్లో దొంగతనం జరగగా... నందిగామలో పట్ట పగలే మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును దోచుకెళ్లారు. వరుస సంఘటనలతో నందిగాం ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు రాత్రి సమయంలో సరైన గస్తీ నిర్వహిస్తే... చోరీలు తగ్గుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి:మద్య నిషేధం హామీ గాలికి...