మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన దుండగుడు - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
07:40 September 11
ఉదయపు నడకకు వెళ్లిన మహేశ్వరి(55)ని రాయితో కొట్టిన దుండగుడు
కడప జిల్లా రాయచోటి మండలం కె.రామాపురంలో చోరీ జరిగింది. రాయచోటి డైట్ వసతిగృహం ఆవరణలో ఉదయపు నడకకు వెళ్లిన ఓ మహిళ మెడలోంచి దుండగుడు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలు మహేశ్వరి ప్రతిఘటించబోయేసరికి... ఆమెపై రాయితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు మహేశ్వరిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:GODAVARI FLOODS: ముంచెత్తిన గోదావరి వరద.. జలదిగ్బంధంలోనే విలీన మండలాల ప్రజలు