మంజీరాకి వరద ఉద్ధృతితో సింగూర్ జలాశయం గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ అందాలు, జల సవ్వడులు చూసేందుకు హైదరాబాద్ టోలీచౌకీకి చెందిన సోదరులు మహ్మద్ సోహెల్, మహ్మద్ సైఫ్‌లు సరదాగా సింగూర్ ప్రాజెక్టు (Singur Project) చూసేందుకు వచ్చారు. అప్పటివరకు ఉల్లాసంగా గడిపిన వారు ప్రాజెక్టు దిగువ భాగంలో సెల్ఫీ (Selfie Tragedy) తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు సైఫ్ నదిలో పడిపోయాడు.
గల్లంతు..
తోడబుట్టినవాడిని రక్షించేందుకు సోహెల్ ప్రాణాలకు తెగించి నీళ్లలోకి దూకాడు. ప్రవాహ ఉద్ధృతి వల్ల సోహెల్ గల్లంతయ్యాడు. సైఫ్ మాత్రం క్రస్టు గేట్ల గోడను పట్టుకుని కేకలు వేయగా నీటిపారుదలశాఖ సిబ్బంది, పోలీసులు తాడు సాయంతో పైకిలాగి ప్రాణాలు రక్షించారు.