ఓ తండ్రి తన కన్న కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సభ్య సమాజం తల దించుకునే ఈ ఘటన తెలంగాణ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది.
కన్నబిడ్డపై మూడు నెలలుగా తండ్రి అత్యాచారం
పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడయ్యాడు. కని పెంచిన చేతులతోనే కాటేశాడు. సభ్యసమాజం తల దించుకునే ఈ ఘటన తెలంగాణ నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
father raped his daughter at Nalgonda
చింతపల్లి మండలంలోని చిన్న నర్సింహ అనే వ్యక్తి తాగుడుకు బానిసై జులయిగా తిరుగుతున్నాడు. అతడి భార్యే కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమార్తె అనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లికి బాలిక మూడు నెలల గర్భవతి అని తెలియడంతో ఆందోళనకు గురైంది. అసలు విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఓ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.
ఇదీ చదంవండి:ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం