ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

SON and FATHER DIED: తనయుడి మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించాడు - కొడుకు మరణంపై నిర్ణయం

SON and FATHER DIED: కొడుకు మరణాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. తనయుడి ఇక లేడన్న విషయం తెలిసి తానూ కూడా తనువు చాలించాడు. నువ్వు లేని ఈ లోకంలో ఉండలేనంటూ తనయుడి వద్దకే చేరాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఉరి వేసుకుని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్​లో జరిగింది.

police station
police station

By

Published : Jan 21, 2022, 2:25 PM IST

SON and FATHER DIED: తనయుడి ఆకస్మిక మరణం తట్టుకోలేక తండ్రి తనువు చాలించిన ఘటన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని జవహర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక అంబేడ్కర్‌ నగర్‌లో భార్య, కుమారుడితో కలిసి లక్ష్మణ్ నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు గత కొంతకాలంగా మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో నిన్న మరణించాడు.

దీంతో తనయుడి మృతిని తట్టుకోలేక లక్ష్మణ్‌ ఇవాళ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక్క రోజు వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి చెందడంతో అంబేడ్కర్‌నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల రోదనలు మిన్నంటాయి.

ABOUT THE AUTHOR

...view details