బర్రె (Buffalo) తోక మెడకు చుట్టుకుని వ్యక్తి మరణించిన ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా కేంద్రం పరిధిలోని నాగవరంలో చోటుచేసుకుంది. వనపర్తి పట్టణం బండారు నగర్‌కు చెందిన దేశీ ఆంజనేయులు.. శనివారం తెల్లవారుజామున నాగవరం వైపు వెళ్తుండగా.. గుమ్మడం బాల్‌రెడ్డి ఇంటి వద్ద గేదె కనిపించింది. దాని తోకను ఆడించే క్రమంలో ఆయన మెడకు బిగుసుకుంది. భయాందోళన గురైన గేదె.. వడివడిగా అటూఇటూ కదలడం వల్ల అతని మెడకు తోక మరింతగా బిగుసుకుని ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందాడు.
గేదె అరుపులతో బయటకు వచ్చిన కాలనీవాసులు వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై షేక్ షఫీ, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒంటిపై బట్టలు లేకుండా ఆంజనేయులు ఉన్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో అనుకోకుండా దాని తోక ఆంజనేయులు మెడకు చుట్టుకొని ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.