తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి అనుచరులు.. తమ ఇంటిపై దాడి చేశారంటూ కరీంనగర్ జిల్లా సుభాష్‌నగర్‌కు చెందిన యువతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సామాగ్రిని బయట పడేసి.. తమను చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. నామమాత్రంగా వచ్చి ఏమీ పట్టించుకోకుండా వెళ్లిపోయారని వాపోయారు. తమకు సహాయం చేయండంటూ బతిమిలాడడం.. స్థానికులను కంటతడి పెట్టించింది.
2013లో కరీంనగర్‌కు చెందిన చిగురు అనిల్ వద్ద రూ. 15 లక్షలతో ఇల్లు కొనుగోలు చేశాం. అప్పటి నుంచి అదే ఇంట్లో ఉంటున్నాం. హైదరాబాద్‌కు చెందిన గోపాలకృష్ణ ఆ ఇంటిని కొనుగోలు చేశానంటూ..గూండాలతో కలిసిపలు మార్లు మా ఇంటిపై దాడులు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదు.