రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి అన్న క్యాంటీన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. 2016లో సచివాలయ ఉద్యోగులు, రాజధాని నిర్మాణ పనులకు వచ్చే కూలీలకు అందుబాటులో ఉండేలా సీఆర్డీఏ అధికారులు మల్కాపురం వద్ద అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఎంతో మంది పేదలకు, ఉద్యోగులకు, కూలీలకు కడుపు నింపిన ఈ అన్నా క్యాంటీన్.. పైకప్పును ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ధ్వంసమైన తొలి అన్న క్యాంటీన్.. పైకప్పు ఎత్తుకెళ్లిన దుండగులు - amaravathi latest news
అమరావతిలో ఏర్పాటు చేసిన తొలి అన్న క్యాంటీన్ ధ్వంసమైంది. గుర్తు తెలియని దుండగులు క్యాంటీన్ పైకప్పును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ధ్వంసమైన తొలి అన్న క్యాంటీన్.. పైకప్పు ఎత్తుకెళ్లిన దుండగులు