చిన్నపిల్లలతో అసహజంగా చిత్రీకరించిన నీలిచిత్రాలు (Blue Flims) చూస్తున్న వారు నేరుగా జైలుకే వెళ్తున్నారు. ఎక్కడున్నా సరే వారిని పోలీసులు వెంటాడి, వేటాడి మరీ పట్టుకుని కోర్టుల్లో హాజరు పరుస్తున్నారు. నాలుగైదేళ్లుగా మైనర్లతో చిత్రీకరించిన నీలిచిత్రాల వెబ్‌సైట్ల (Blue Film websites shot with minors)ను వీక్షించే వారి సంఖ్య పెరుగుతుండడం, వీటి ప్రభావంతో చిన్నారులు, మైనర్లపై అకృత్యాలు పెరుగుతుండడంతో కేంద్ర హోంశాఖ (Central Home Department) ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగా నీలిచిత్రాలు చూస్తున్న వారిని గుర్తించి వారి చరవాణులు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ఐపీ చిరునామాల ఆధారంగా నిందితులను గుర్తించి నివేదికను ఆయా రాష్ట్రాలకు పంపుతోంది.
Prison: బ్లూ ఫిల్స్మ్ చూస్తున్నారా? అయితే నేరుగా జైలుకే.. రూ.10 లక్షల జరిమానా!
నీలిచిత్రాలు చూస్తున్న వారిని గుర్తించే పనిలో కేంద్రం నిమగ్నమైంది. వారి చరవాణులు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ఐపీ చిరునామాల ఆధారంగా నిందితులను గుర్తించి నివేదికను ఆయా రాష్ట్రాలకు పంపుతోంది. చిన్నారులు, మైనర్లపై అకృత్యాలు పెరుగుతుండడంతో కేంద్ర హోంశాఖ ఈ అంశంపై దృష్టి సారించింది.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకూ 1,095 మందిని అరెస్ట్ చేశారు. ఈ తరహా నీలిచిత్రాల వెబ్‌సైట్లను చూస్తున్న వారిని జాతీయ నేర గణాంకాల బ్యూరో గుర్తిస్తుంది. మారుమూల ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు నీలి చిత్రాల వెబ్‌సైట్లు చూస్తున్న వారిని గుర్తించేందుకు ఈ బ్యూరో సీ సామ్ అనే అమెరికన్ సంస్థతో నాలుగేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ఇస్తున్న వివరాలతోపాటు అదనంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి నిందితులను జైలుకు పంపుతున్నాయి. కేరళలో పీ-హంట్ పేరుతో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా.. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌తో మహారాష్ట్ర పోలీసులు సంప్రదించి సైబర్ సెల్ ద్వారా నిందితుల వివరాలను సేకరిస్తున్నారు.
తొలుత ఐదేళ్లు.. రెండోసారి దొరికితే ఏడేళ్లు..
- చిన్నారులపై చిత్రీకరించిన నీలిచిత్రాల వీక్షణాన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. తొలిసారి దొరికిన వారికి ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల వరకూ జరిమానా విధిస్తున్నాయి.
- రెండోసారి కూడా నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తే... ఏడేళ్లపాటు జైలులోనే ఉండాలి. దీంతోపాటు రూ.10లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
- హైదరాబాద్‌లో రెండేళ్ల క్రితం 16 కేసులు నమోదు కాగా, ఇందులో ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది కూడా 20 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు నిందితులపై రెండోసారి కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త