ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

HARASSMENT: మహిళా పోలీసుకు తప్పని వేధింపులు.. ఏం చేశారంటే?

గతంలో మహిళా వాలంటీర్లను వేధించాడు.. తాజాగా మహిళా పోలీసును వేధించడం మొదలుపెట్టాడు. ఎంత చెప్పినా వినలేదు.. ఇలా అయితే కుదరదని ఆమె.. దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిక్క కుదిర్చింది.

thadepalli-secretariate-employee-harassed-a-women-police
మహిళా పోలీసుపై యువకుడి వేధింపులు.. తట్టుకోలేక ఏం చేసిందంటే?

By

Published : Oct 23, 2021, 4:36 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి 12, 13వార్డు సచివాలయం అడ్మిన్ కిషోర్ తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళా పోలీసు అధికారిణి దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. గతంలోనూ కిషోర్ పలువురు మహిళా వాలంటీర్లను వేధించాడనే ఆరోపణలున్నాయి. బాధిత మహిళలు అతనిపై ఫిర్యాదు చేసినప్పటికీ.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారని బాధిత పోలీసు అధికారిణి చెప్తోంది.

అతను ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ఉద్దేశంతోనే.. పోలీసు అధికారిణి అయిన తనను కూడా వేధించాడని ఆమె వాపోయింది. వేధింపులు ఎక్కువ కావడం వల్ల మనోవేదనకు గురయ్యాయనని.. అందువల్లే దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపింది. ఈ విషయంపై స్పందించిన పోలీసులు వెంటనే కిషోర్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details