కడప జిల్లా బద్వేలులో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమవ్వడం కలకలం రేపింది. నిన్న పాఠశాలకు వెళ్లిన పదో తరగతి విద్యార్థి రహమాన్, ఏడో తరగతి విద్యార్థులు నబి, రహీం తిరిగి ఇంటికి రాలేదు. రాత్రి వరకు వీరి కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు.
MISSING: బద్వేలులో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం..ఏమయ్యారు? - kadapa latest crime news
బద్వేలులో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు అదృశ్యం
09:45 November 06
నిన్న పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాని విద్యార్థులు
వీరు ఇంట్లో పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి బద్వేలుకు సమీపంలోని అబుసాహెబ్ పేట వద్ద సైకిళ్లు పెట్టి హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. విద్యార్థులను ఆచూకీ కనుగొన్న పోలీసులు వారిని అక్కడి నుంచి బద్వేలు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:
కుప్పం ఆర్వోని బాధ్యతల నుంచి తొలగించండి.. హైకోర్టులో తెదేపా పిటిషన్
Last Updated : Nov 6, 2021, 12:34 PM IST