FARMER COUPLE SUICIDE: అప్పులు తీర్చలేక.. కుటుంబాలను ఆనందంగా ఉంచలేక చాలా మంది రైతులు తనువులు చాలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణపాలెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెల్లం సుబ్బారావు అనే రైతు 8 ఎకరాలు పొలాన్ని కౌలుకు తీసుకుని మిర్చి సాగుచేశాడు. ప్రకృతి అనుకూలించకపోవడం, అధికవర్షాల కారణంగా.. వరుసగా నష్టాలు రావడంతో సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయల మేర అప్పులు అయ్యాయి.వాటిని తీర్చేమార్గం లేకపోవటంతో సుబ్బారావు(50), అతని భార్య శేషమ్మ (45) ఇంట్లో పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బంధువులు దంపతులిద్దరిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. ఒకేసారి దంపతులిద్దరు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అప్పులు తీర్చలేక.. రైతు దంపతుల ఆత్మహత్య - బాపట్ల జిల్లా తాజా వార్తలు
FARMER COUPLE SUICIDE: నేలతల్లిని నమ్ముకుని బతుకులీడుస్తున్న అన్నదాతలకు అప్పుల రూపంలో మృత్యువు వెంటాడుతోంది. పంట చేతికి రాని స్థితి కొందరిదైతే.. గిట్టుబాటు ధర రాని పరిస్థితి మరికొందరిది. అప్పుల భారం పెరిగిపోయి.. కుటుంబాన్ని పోషించలేని దీనస్థితికి చేరి.. చివరికి తనువు చాలిస్తున్నారు. తాజాగా పంటలో నష్టం వాటిల్లి అప్పులు తీరే మార్గం లేక కౌలు రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది.
FARMER COUPLE SUICIDE