Ganja Rocket: నెల్లూరులో పోలీసులు భారీ గంజాయి రాకెట్‌ని ఛేదించారు. కార్లలో రహస్య అరలు చేయించి గంజాయి రవాణా చేస్తున్న శ్రీనివాసరావు, రవితేజను కందుకూరి పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి 10 లక్షల రూపాయల విలువగల 105 కేజీల గంజాయి, 3 కార్లు, 8 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ ఏజెన్సీ ప్రాంతాల నుంచి దిల్లీకి గంజాయి సరఫరా చేస్తున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మద్యం తెచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. 2016లో శ్రీనివాసరావు గంజాయి కేసులో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించినట్లు చెప్పారు.
Ganja Rocket: భారీ గంజాయి రాకెట్‌ను ఛేదించిన పోలీసులు.. ఎక్కడంటే? - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
Ganja Rocket: నెల్లూరులో భారీ గంజాయి రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. కార్లలో రహస్య అరలు చేయించి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
భారీ గంజాయి రాకెట్‌ని ఛేదించిన పోలీసులు