ROAD ACCIDENT IN KADAPA :వాళ్లంతా దైవ దర్శనం చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఉదయం కావడంతో కొద్ది మంది నిద్రలో ఉండగా.. మరి కొద్దిమంది ఇంటికి వెళ్తున్నామన్న ఆనందంలో ఉన్నారు. ఇంతలోనే మృత్యువు నేనున్నాంటూ వాళ్ల దరి చేరింది. మృత్యువుతో చేసిన పోరాటంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది.
లారీని ఢీకొన్న టెంపో.. ముగ్గురు మృతి, మరో ఎనిమిది మంది - ఏపీ తాజా వార్తలు
06:45 January 20
లారీని ఢీకొన్న టెంపో వాహనం
చాపాడు వద్ద.. హుబ్లీ-కృష్ణపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. లారీని టెంపో వాహనం ఢీకొన్న ఈ ఘటనలో మరో 8 మందికి గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన వీరంతా.. టెంపో వాహనంలో తిరుమల వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
టెంపో వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి.. రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మృతులు.. రాములమ్మ, ఓబులమ్మ, అనూషగా గుర్తించారు. గాయపడ్డవారిని ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే గమ్యం చేరుకుంటారనగా... ప్రమాదం చోటుచేసుకోవడం.. మృతులు, క్షతగాత్రుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
ఇవీ చదవండి: