ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Student Died: ఉన్నత చదువు కోసం వెళ్లి.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి - అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Student Died In America: ఆ తల్లి కోరిక మేరకు ఉన్నత చదువుల కోసం అతడు నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణ వార్త వినగానే ఆ తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది.

Student Died In America
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

By

Published : Apr 10, 2022, 12:29 PM IST

Student Died In America: ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయాడు. ఒంగోలు మండలం కొప్పోలుకు చెందిన కార్తీక్ ఉన్నత చదువుల కోసం నాలుగు నెలల కిందట షికాగో వెళ్ళాడు. నిన్న రాత్రి ఫిట్స్ రావడం వల్ల ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. కార్తీక్ మరణవార్త వినగానే తల్లి శోభారాణి, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కార్తీక్ చిన్నతనంలోనే తండ్రి కాలం చేశారు. కార్తీక్ తమ్ముడు అనారోగ్యంతో చనిపోయారని బంధువులు వెల్లడించారు. కార్తీక్ మృతదేహాన్ని తరలించేందుకు తానా కృషి చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details