Cyber Criminals Trap Kamareddy deputy MRO: తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. పాన్‌కార్డ్ అప్‌డేటేషన్ చేసుకోవాలంటూ.. ఉప తహసీల్దార్‌కు టోకరా వేశారు. ఎస్బీఐకి సంబంధించి పాన్‌కార్డ్ అప్‌డేట్ చేసుకోవాలని.. లేదంటే 'యోనోయాప్' పనిచేయదంటూ ఉప తహసీల్దార్ రంజిత్ మెయిల్‌కు లింక్ పంపారు. ఈ లింక్ ను తెరిచే క్రమంలోనే.. మొత్తం 5 విడతల్లో.. 3 లక్షల 40 వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు.
Cyber Criminals Trap Deputy MRO: డిప్యూటీ తహసీల్దార్‌నే మాయ చేశారు.. రూ.3.50 లక్షలు కొట్టేశారు! - Cyber crime
Cyber Criminals Trap Kamareddy deputy MRO: ఏ మాత్రం అవకాశం ఇచ్చినా.. క్షణాల్లోనే ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. రోజుకో కొత్త పంథా అనుసరిస్తూ.. జనాలకు అనుమానం రాకుండానే డబ్బులు కొల్లగొడుతున్నారు. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి డిప్యూటీ తహసీల్దార్‌కు టోకరా వేశారు.
Cyber Criminals Trap Deputy MRO
బాధితుడు అప్రమత్తమై అడ్డుకునే ప్రయత్నం చేసినా.. అప్పటికే ఖాతా నుంచి డబ్బులు మాయమైపోయాయి. రంజిత్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త పన్నాగాలు పన్నుతారని... వారి ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని లింకులు ఏవైనా వస్తే.. వాటిని ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:Dead body in Water tank : తాగునీటి ట్యాంకులో మృతదేహం.. కేసు ఛేదించిన పోలీసులు