OBSENCE BEHAVIOUR: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యి ప్రత్యేక తరగతులకు హాజరైన ఓ విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాల (బాలురు)లో చోటు చేసుకుంది. విద్యార్థి బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 13 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు తప్పిన పలువురు విద్యార్థులు దీనికి హాజరయ్యారు. తరగతులు ముగిసిన అనంతరం మీసాల శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు ఒక విద్యార్థినికి ప్రత్యేక పాఠ్యపుస్తకాలు ఇస్తానని రమ్మంటూ గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో విషయం చెప్పింది. దాంతో ఆగ్రహం చెందిన బంధువులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడుని నిలదీసి.. దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ప్రత్యేక తరగతులకు వచ్చిన విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. ఎక్కడంటే - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
OBSENCE BEHAVIOUR: విద్య నేర్పించి విద్యార్థులను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాల్సిన ఉపాధ్యాయుడు గాడి తప్పాడు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది.
obsence behavior
అయితే అదే ఉపాధ్యాయుడిపై జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురంలో కొన్నేళ్ల కిందట ఇదే తరహాలో ఆరోపణలు ఉన్నాయి. జరిగిన ఘటనపై విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: