ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

రూబీ గోల్డ్ కుంభకోణం: పటేల్​గూడలో మరోసారి సోదాలు - tamil police investigation on chennai ruby gold scam case

రూబీ గోల్డ్ కుంభకోణం కేసులో తమిళనాడు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తమిళ పోలీసులు.. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలం పటేల్​గూడలోని నిందితుల ఇళ్లలో మరోసారి సోదాలు నిర్వహించారు.

tamil-police
tamil-police

By

Published : Feb 4, 2021, 11:52 AM IST

వడ్డీ లేకుండా రుణాలిస్తామని ఆశపెట్టి భారీ బంగారంతో పరారైన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తమిళనాడు పోలీసులు తెలిపారు. చెన్నై టీనగర్​లో ఇఫ్జర్ రెహమాన్.. ఆయన సోదరుడు హిప్సార్ అనీస్ రెహమాన్.. రాయల్ రూబీ జ్యువెలరీ దుకాణం నిర్వహించేవారు. బంగారు నగలపై వడ్డీ లేకుండా రుణాలిస్తామని చెప్పి సుమారు 1500 మంది నుంచి బంగారం సేకరించి పరారయ్యారు.

తెలంగాణ సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ పరిధి పటేల్​గూడలో నిందితులను గుర్తించిన తమిళ పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రెహమాన్ బ్రదర్స్​లో ఒకరిని సంగారెడ్డి జిల్లా పటేల్​గూలోని తన నివాసానికి తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. విచారణలో వెల్లడైన విషయాలు, కేసు గురించిన వివరాలను ఈనెల 22న వెల్లడిస్తామని తమిళ పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details