తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని కలత చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కేయూ విద్యార్థి సునీల్ నాయక్ మృతి చెందాడు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో బోడ సునీల్ మార్చి 26న ఆత్మహత్యాయత్నం చేశాడు. బలవన్మరణ యత్నానికి ముందు సెల్ఫీ విడియోను రికార్డు చేశాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సినోడిని ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని... విద్యార్థుల్లారా మీరు ఉద్యోగాల కోసం పోరాడండి అని పేర్కొన్నాడు. నిరుద్యోగుల సమస్యను ప్రభుత్వానికి తెలియజేయాలన్న కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ: ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని కేయూ విద్యార్థి ఆత్మహత్య - వరంగల్ వార్తలు
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని కేయూ విద్యార్థి సునీల్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. నిరుద్యోగుల సమస్యను ప్రభుత్వానికి తెలియజేయాలన్న కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ku student suicide
బోడ సునీల్ నాయక్ స్వస్థలం గూడూరు మండలం తేజవత్ రాంసింగ్ తండా. సునీల్ మృతి పట్ల పలువులు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: