ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

నది, చెరువుల్లో సాగు..లెవీ బియ్యం బిల్లుల కోసం కొత్త ఎత్తుగడ - ఏపీ తాజా వార్తలు

పొలం లేకున్నా.. పంట పండకున్నా.. ధాన్యం అమ్మకున్నా... ఈ-క్రాప్‌లో నమోదు చేసి లెవీ బియ్యం బిల్లులు చేసుకునేందుకు పక్కా ప్రణాళిక వేశారు. చెరువులు, నది, ప్రభుత్వ కార్యాలయాలు.. చివరికి జాతీయ రహదారినీ పంటభూమిగా రికార్డుల్లో నమోదు చేశారు. ధాన్యాన్ని రైసు మిల్లులకు ఇచ్చినట్లు దొంగ లెక్కలు రాసేశారు.

సూళ్లూరుపేట వ్యవసాయశాఖ
సూళ్లూరుపేట వ్యవసాయశాఖ

By

Published : Jul 18, 2022, 3:56 AM IST

పొలం లేకున్నా.. పంట పండకున్నా.. ధాన్యం అమ్మకున్నా... ఈ-క్రాప్‌లో నమోదు చేసి లెవీ బియ్యం బిల్లులు చేసుకునేందుకు పక్కా ప్రణాళిక వేశారు. చెరువులు, నది, ప్రభుత్వ కార్యాలయాలు.. చివరికి జాతీయ రహదారినీ పంటభూమిగా రికార్డుల్లో నమోదు చేశారు. ధాన్యాన్ని రైసు మిల్లులకు ఇచ్చినట్లు దొంగ లెక్కలు రాసేశారు. దీనికి మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకూ సిఫార్సు చేశారు. ఈ ఘరానా మోసం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వ్యవసాయశాఖ సబ్‌ డివిజన్‌లో చోటుచేసుకుంది.

ఈ-క్రాప్‌లో పంట వివరాలు నమోదు చేసిన రైతులకు ఆర్బీకేల ద్వారా ధాన్యం బిల్లులివ్వాలి. ప్రభుత్వం మిల్లర్ల నుంచి లెవీ బియ్యం సేకరించి బిల్లులు ఇచ్చేందుకు ఈ పద్ధతి తప్పనిసరి. ఇందుకోసం అక్రమార్కులు వరి సాగు చేయని రైతుల పేర్లను ఈ-క్రాప్‌లో నమోదు చేశారు. పంట భూములు కాకుండా చెరువులు, జాతీయ రహదారి, కాళంగి నది, కాలువల సర్వే నంబర్లను నమోదు చేసి.. బిల్లులు చేసుకునేందుకు దస్త్రాలు కదిలించారు. మిల్లర్లకు వ్యవసాయశాఖ సిబ్బంది సాయమందించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో చోటుచేసుకుంది.

క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే..
* 10, 4, 5, 6, 70, 74, 76-1 సర్వే నెంబర్లలోని 23.61 ఎకరాల్లో తల్లంపాడుకు చెందిన కె.వెంకటేశ్వర్లు.. 322.8 క్వింటాళ్ల ధాన్యం పండించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ఆ సరకుకు.. రూ.6,32,688 బిల్లు పంపారు. వాస్తవానికి ఈ సర్వే నంబర్లలో జాతీయ రహదారి కాలువ, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి.

* బురదమడుగుకు చెందిన కె.వెంకటరామయ్య అనే రైతు కాళంగి నదిలోనే ధాన్యం పండించినట్లు రికార్డులు సృష్టించారు. ఇతని పేరిట రూ.10,70,160 బిల్లులు సిద్ధం చేయడం గమనార్హం.

* చిన్నన్న చెరువు, లింగారెడ్డి చెరువుల్లో సాగు చేసిన ధాన్యానికి చందనమూడికి చెందిన ఎం.జయచంద్ర, ఎం.అనిల్‌కుమార్‌, కె.మనోజ పేర్లతో రూ.27,47,920 బిల్లులకు సిఫార్సు చేశారు.

* సూళ్లూరుపేట వ్యవసాయశాఖ సబ్‌ డివిజన్‌లోని తల్లంపాడు ఆర్బీకే పరిధిలో సాగు చేయని 184.19 ఎకరాలను ఈ-క్రాప్‌లో నమోదు చేసి, రైతులు 2,651.80 క్వింటాళ్ల ధాన్యాన్ని రైసు మిల్లులకు సరఫరా చేసినట్లు, రూ.51,96,352 మేర చెల్లించాలని రెవెన్యూ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.

విచారణ జరిపిస్తాం
‘సూళ్లూరుపేట పరిధిలో ఈ-క్రాప్‌ నమోదు అక్రమాలపై విచారిస్తాం. స్థానిక అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటా’ అని జిల్లా వ్యవసాయ అధికారి దొరసాని తెలిపారు.

ఇవీ చదవండి:అది మంకీపాక్స్​ కాదు... సాధారణ దద్దుర్లే..: వైద్యులు

రోడ్లపై కుంటలు.. బురదలో ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details