ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

సుబ్బారావు, శివ రెండో రోజు విచారణ.. ఇవాళ అరెస్ట్​ చేసే అవకాశం - Secunderabad protest accused

Secunderabad riots update: సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ అల్లర్ల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విధ్వంసానికి యువకులకు ఉసిగొల్పిన ఆవుల సుబ్బారావు, శివను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. వీళ్లిద్దరిని ఇవాళ అరెస్ట్​ చేసే అవకాశమున్నట్టు సమాచారం.

సుబ్బారావు, శివ రెండో రోజు విచారణ
సుబ్బారావు, శివ రెండో రోజు విచారణ

By

Published : Jun 23, 2022, 3:24 PM IST

Secunderabad riots update: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సాయి డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు, శివను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. రైల్వేస్టేషన్​లో ఆందోళన కంటే ముందుగానే కీలక నిందితులతో సుబ్బారావు.. మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ఇవాళ సుబ్బారావు, శివను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విధ్వంసంలో సాయి డిఫెన్స్‌ అకాడమీ అభ్యర్ధులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఈ అల్లర్ల ఘటనలో ఇప్పటికే 63 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. అంతకు ముందుకు 45 మందిని అరెస్ట్​ చేసిన పోలీసులు.. నిన్న ఏ-2 పృథ్వీరాజ్​తో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. వాళ్లందరిని అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. నిందితులుగా చేర్చారు. ఆ తర్వాత వాళ్లను సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన తర్వాత వారిని చంచల్​గూడ జైలుకి తరలించారు. దీంతో ఇప్పటి వరకు 55 మందిని అరెస్టు చేసినట్టైంది. పరారీలో ఉన్న మరో 8 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details