Students Fight: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య విద్యాసంస్థల విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. బీటెక్ చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా కొట్టుకున్నట్టు సమాచారం. గాయపడిన ఇద్దరు విద్యార్థులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కళాశాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థుల్ని తోటి విద్యార్థులే ఆస్పత్రికి తీసుకువచ్చినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కాకినాడలో బీటెక్ విద్యార్థుల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు - student fighting in andhra pradesh
Students Fighting: చదువుకుంటారని పిల్లలను తల్లిదండ్రులు కాలేజీలకు పంపితే.. విద్యార్థులు మాత్రం చదువును పక్కన పెడుతున్నారు. సినిమాల ప్రభావమో ఏమోగానీ గ్రూపులుగా ఏర్పడి.. ఫైటింగ్‌లు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులు కొట్టుకున్నారు.
students fight