రుషికొండ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగిన ఇద్దరు విద్యార్థులు! - AP News
16:55 March 12
రుషికొండ సముద్రతీరంలో విషాదం
Rushikonda beach: విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి, ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 8వ తరగతి విద్యార్థి మొయ్య పార్దు మృతదేహం లభ్యమయ్యింది. పదో తరగతి విద్యార్థి సత్యాల రాజేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరో విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. పర్రి సాయి అనే విద్యార్థికి గీతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులు పరదేశిపాలేనికి చెందిన శ్రీరామా ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: Women death: పాపం పసివాడు.. నాలుగు రోజులుగా అమ్మ మృతదేహంతోనే..!