Local people rescue one student: ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు జడ్పీ పాఠశాల విద్యార్థులు పవిత్ర సంగమం ఘాట్‌లో సరదాగా దిగి ఆటలాడుతుండగా గల్లంతయ్యారు. నలుగురు విద్యార్థులు వెంటనే చేరుకొని ఒడ్డుకు చేరుకోగా.. మరో ఇద్దరు విద్యార్థులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అందులో ఒకరిని స్థానికులు రక్షించగా మరొకరు కనిపించకుండా గల్లంతయ్యాడు. వీరంతా జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. కొండపల్లి చైతన్య నగర్‌కు చెందిన ఉప్పలపాటి లోకేష్ (13) నదిలో గల్లంతయ్యాడు. మల్కాపురానికి చెందిన చెరుకు సిద్ధార్థను (13) స్థానికులు రక్షించారు. దామెర్ల వారి వీధికి చెందిన ఈ ఊరి తరుణ్ (13), కోటయ్య నగర్‌కు చెందిన ఉప్పలపాటి అవినాష్ (13), కోటయ్య నగర్‌కు చెందిన పచ్చిగోళ్ళ హర్షవర్ధన్ (13), బ్యాంక్ సెంటర్‌కు చెందిన నేడురి సుమంత్ (13) ఒడ్డుకు చేరుకున్నారు. వీరంతా డీఏవీ స్కూల్లో వాకింగ్ చేస్తున్నామని చెప్పి పవిత్ర సంఘం ఘాటుకు వచ్చారు. సరదాగా స్నానం చేసి వద్దామనుకొని దిగి గల్లంతయ్యారు. గల్లంతయిన విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈత కోసం సరదాగా నదిలో దిగి విద్యార్థి గల్లంతు
Student missing in River పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు కన్నీటిని మిగుల్చుతోంది. అప్పటివరకు తోటి విద్యార్థులతో కేరింతలు కొట్టిన ఆ అబ్బాయి ఈత కోసం నదిలో దిగి గల్లంతయ్యాడు. మరో విద్యార్థిని స్థానికులు రక్షించారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది.
ప్రాణాలమీదకు తెచ్చిన ఈత సరదా