ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఫ్రెండ్​కు టీసీ ఇవ్వలేదని కళాశాలలోనే పెట్రోల్ పోసుకొని విద్యార్థి ఆత్మహత్యాయత్నం - విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Student Suicide Attempt ఓ విద్యార్థికి ప్రిన్సిపల్​ టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నాడని విద్యార్థి నాయకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అడ్డుకున్న ప్రిన్సిపల్​తో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

suicide attempt
suicide attempt

By

Published : Aug 19, 2022, 3:41 PM IST

Updated : Aug 19, 2022, 10:23 PM IST

Student suicide attempt: హైదరాబాద్​ రామంతాపూర్​లోని ప్రైవేటు కళాశాలలో విద్యార్థి నాయకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సాయి నారాయణ అనే విద్యార్థి సదరు కళాశాలలో జూన్​లో ఇంటర్ పూర్తి చేశాడు. కళాశాలకు రూ.16 వేల ఫీజు కట్టాల్సి ఉండగా.. మొత్తం చెల్లిస్తేనే టీసీ ఇస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో సాయి నారాయణ కళాశాలకు వెళ్లాడు. ఫీజు చెల్లించలేదని, టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. అతనితో పాటు విద్యార్థి నాయకుడు సందీప్, మరికొందరిని తీసుకెళ్లాడు. ఫీజు బకాయిలు ఉండటంతో టీసీ ఇవ్వడానికి కళాశాల సిబ్బంది నిరాకరించారు.

ఇదే విషయంపై సందీప్, ప్రిన్సిపల్​కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఫీజు విషయం, టీసీ గురించి మాట్లాడుతుండగా సందీప్ ప్రిన్సిపల్​ను బెదిరించేందుకు తనతో తీసుకొచ్చిన పెట్రోల్​ను ఒంటిపై పోసుకున్నాడు. కృష్ణాష్టమి వేళ వెలిగించిన దీపం పక్కనే ఉండటంతో మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్ సుధాకర్​రెడ్డి, ఏవో అశోక్​రెడ్డి గాయపడ్డారు.

ఈ ఘటనతో ప్రిన్సిపల్​ గదిలో మంటలు అంటుకుని ఏసీతో పాటు అక్కడి సామగ్రి కాలిపోయాయి. కుర్చీలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు. సందీప్​ సహా ప్రిన్సిపల్ సుధాకర్​రెడ్డి, ఏవో అశోక్​రెడ్డి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని.. ఎవరికీ ప్రాణాపాయం లేదని, ముగ్గురూ కోలుకుంటున్నారని పోలీసులు వివరించారు.

టీసీ ఇవ్వలేదని కళాశాలలోనే పెట్రోల్ పోసుకొని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

సాయి నారాయణ జూన్‌లో ఇంటర్ పూర్తి చేశాడు. కళాశాలకు రూ.16 వేలు ఫీజు చెల్లించాలి. టీసీ కోసం విద్యార్థి కళాశాలకు వచ్చాడు. విద్యార్థి సాయినారాయణ తనవెంట కొందరిని తీసుకొచ్చాడు. సందీప్‌ అనే విద్యార్థి పెట్రోల్‌ సీసాతో లోపలికి వచ్చాడు. ప్రిన్సిపల్‌ను బెదిరించేందుకు తనపై పెట్రోల్‌ చల్లుకున్నాడు. కృష్ణాష్టమి సందర్భంగా పక్కనున్న టేబుల్‌పై దీపం ఉంది. మంటలు చెలరేగి సందీప్‌, ప్రిన్సిపల్‌, ఏవోకు గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి డీఆర్​డీవో అపోలోకు తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు, కోలుకుంటున్నారు.-పోలీసులు

కళాశాలపై దాడి..: ఈ ఘటన వివరాలు తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు.. కళాశాల వద్ద ధర్నా చేశారు. కొంతమంది కళాశాలపై దాడి చేయగా అద్దాలు పగిలిపోయాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి.. కళాశాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

షోకాజ్​ నోటీసులు జారీ..: ఇదిలా ఉండగా.. కళాశాల యాజమాన్యానికి ఇంటర్మీడియట్​ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఘటనపై వివరణ కోరారు. పోలీసుల నుంచి సమాచారం తీసుకున్న అధికారులు.. సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్, అకౌంట్స్ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాల వరకు కాలేజీ పోలీసుల అధీనంలో ఉండనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 19, 2022, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details